Thursday, October 24, 2024
HomeNewsDana cyclone: తీవ్ర తుపానుగా 'దానా'

Dana cyclone: తీవ్ర తుపానుగా ‘దానా’

గాలి-వాన..

https://ndem.nrsc.gov.in/#

- Advertisement -

(‘దానా’ తీవ్రతుపాన్ లైవ్ కోసం లింక్)

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘దానా’

గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్

పారాదీప్ (ఒడిశా)కి 260 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 290 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 350 కిమీ దూరంలో కేంద్రీకృతం

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా – ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటే అవకాశం

మత్స్యకారులు వేటకు వెళ్లరాదు

తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతం

చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు

ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి

• భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.
• ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.
• వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప)
షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత
• భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.
• మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.
• కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.

~రోణంకి కూర్మనాధ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News