Saturday, November 15, 2025
HomeNewsFrench fries: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ని అతిగా తింటున్నారా..షుగర్‌ వచ్చేస్తుంది జాగ్రత్త!

French fries: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ని అతిగా తింటున్నారా..షుగర్‌ వచ్చేస్తుంది జాగ్రత్త!

French fries VS Health: కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ రుచి చూస్తే ఆగడం కష్టం. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే ఈ వేపుళ్లు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనవే. కానీ తాజాగా వెలువడిన ఒక పరిశోధన ఫలితాలు ఈ రుచికరమైన ఆహారం వెనుక దాగి ఉన్న ఆరోగ్య ముప్పులను స్పష్టంగా చూపించాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఈ అలవాటు వల్ల గణనీయంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

టైప్ 2 డయాబెటిస్

తాజాగా నిర్వహించిన ఒక విశ్లేషణలో,  మూడు సార్లకు పైగా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు సుమారు 20 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు. వారం ఐదు సార్లకు మించి తింటే ఈ ముప్పు 27 శాతం దాటిందని కూడా అధ్యయనం తెలిపింది. 40 ఏళ్లు పైబడిన దాదాపు రెండు లక్షల మంది వైద్య సిబ్బంది మరియు ఇతర వర్గాల వ్యక్తుల ఆహారపు అలవాట్లను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.

బ్లడ్ షుగర్ స్థాయిలు..

ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారిలో బ్లడ్ షుగర్ స్థాయిలు తిన్న వెంటనే పెరిగినట్లు రికార్డు చేశారు. ఈ అలవాటు కలిగిన సుమారు 22 వేల మందిలో డయాబెటిస్ లక్షణాలు ఉన్నాయని అధ్యయన బృందం గమనించింది. దీని వెనుక ప్రధాన కారణం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం. ఆలుగడ్డలను నూనెలో ఎక్కువసేపు వేయించినప్పుడు అందులో కేలరీలు విపరీతంగా పెరుగుతాయి. ఫ్యాట్ అధికంగా శరీరంలోకి వెళ్లి బరువు పెరుగుతాడు. బరువు పెరగడం ఊబకాయం, తర్వాత డయాబెటిస్ ముప్పుకు దారి తీస్తుంది.

పిండి పదార్థం..

ఆలుగడ్డల్లో సహజంగానే పిండి పదార్థం ఎక్కువ. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటంతో తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇలా తరచూ అధిక కేలరీల వేపుళ్లు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది. ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండవు. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటిస్‌కి దారితీస్తుంది.

పరిశోధకులు చెబుతున్న మరో అంశం ఏమిటంటే, ఆలుగడ్డలు ఆరోగ్యానికి పూర్తిగా హానికరం కావు. ఉడకబెట్టిన రూపంలో మితంగా తింటే బీపీ, బరువు నియంత్రణ, డయాబెటిస్ నివారణలో సహాయపడతాయి. కానీ వాటిని నూనెలో వేసి వేయిస్తే ఆ ప్రయోజనాలు మాయం అవుతాయి. ఉడకబెట్టిన ఆలుగడ్డలను వారం మూడు సార్లకు మించి తీసుకోకపోతే డయాబెటిస్ ముప్పు సుమారు 5 శాతం వరకు తగ్గుతుందని ఈ అధ్యయనం సూచిస్తోంది.

Also Read: https://teluguprabha.net/health-fitness/home-remedies-for-chest-pain-caused-by-gas/

ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తినడం కేవలం డయాబెటిస్‌కే కాదు, గుండె సంబంధిత వ్యాధులు, ఇన్‌ఫ్లమేషన్ వంటి దీర్ఘకాలిక సమస్యలకూ కారణమవుతుంది. నూనెలో వేయించిన ఆహారాల్లో ఉండే అధిక ఫ్యాట్స్ మరియు కేలరీలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీని ప్రభావం క్రమంగా హృదయానికి నష్టం చేస్తుంది.

అధ్యయన నివేదిక ప్రకారం, ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపిస్తే మోతాదును గణనీయంగా తగ్గించాలి. వారం మూడుసార్లు కాకుండా ఒక్కసారి మాత్రమే తీసుకోవడం మంచిది. మిగతా రోజుల్లో సజ్జలు, రాగులు, జొన్న వంటి పోషకధాన్యాలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ముప్పు 8 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అలాగే వైట్ రైస్ అధికంగా తినకూడదు. కొంతవరకు బ్రెడ్, పాస్తా వంటి ప్రత్యామ్నాయాలను కూడా ఉపయోగించవచ్చని అధ్యయనం పేర్కొంది.

నూనెలో వేయించిన పదార్థాల..

నిపుణులు చెబుతున్నదేమిటంటే, మన ఆహారంలో నూనెలో వేయించిన పదార్థాల మోతాదును తగ్గిస్తేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రుచి కోసం మితిమీరిన ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులకు కారణం కావొచ్చు. అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేపుళ్లను వీలైనంత వరకు దూరం పెట్టడం లేదా వారానికి ఒకసారికి మించకుండా పరిమితం చేయడం అవసరం.

మొత్తం మీద, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకర్షణ ఎంత ఉన్నప్పటికీ వాటిని తరచుగా తినడం శరీరానికి నెమ్మదిగా హాని చేస్తుంది. బరువు పెరుగుదల, రక్తంలో చక్కెర పెరుగుదల, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించాలంటే ఈ అలవాటు మార్పు తప్పనిసరి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad