Thursday, April 10, 2025
HomeNewsED shocks yet another IAS officer: ఐఏఎస్ అమోయ్‌కుమార్‌కు ఈడీ షాక్

ED shocks yet another IAS officer: ఐఏఎస్ అమోయ్‌కుమార్‌కు ఈడీ షాక్

మరో అధికారి..

రంగారెడ్డి జిల్లాకలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ శాఖ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ధారాదత్తంగా అప్పగించారని, భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని అమోయ్‌కుమార్‌పై పలువురు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మేడ్చల్‌ జిల్లా నుంచి కూడా అమోయ్‌కుమార్‌పై ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు అమోయ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో అమోయ్‌కుమార్‌ విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News