HomeNewsCm revanth: కరోనా కంటే పెద్దది ఎల్‌నినో.. సీఎం రేవంత్ హెచ్చరిక

Cm revanth: కరోనా కంటే పెద్దది ఎల్‌నినో.. సీఎం రేవంత్ హెచ్చరిక

Cm revanth: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి కొరత, విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా సమయంలో అనుసరించిన విధంగానే ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కరోనా కంటే ఎల్‌నినో పెద్ద విపత్తు అని అన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై ఎల్‌నినో ప్రభావం పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తమై చర్యలు తీసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.

రాబోయే నెలల్లో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అవసరమైన నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

రైతులు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని, పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులపై నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. గ్రామస్థాయి నుంచి ప్రజలకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ఎల్‌నినో పరిస్థితుల కారణంగా విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News