Delhi: కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటరు జాబితాలో తప్పులను సరిచేసేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ (SSR) చేపట్టనున్నట్లు ప్రకటించింది. 2027 జనవరి 1లోగా సరి చేసుకోవాలి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అస్సాం సహా పలు రాష్ట్రాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి కూడా ఇందులో ఉన్నాయి.
18 ఏళ్లు నిండిన యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్నవారు తమ వివరాల్లో తప్పులను సరిచేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నికల సంఘం సూచించిన విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన సవరణ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన కోసం ఓటర్లు వేచి చూడాల్సి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

