Tuesday, June 17, 2025
HomeNewsEPFO Portals for Free Services : ఆ EPFO సర్వీసులన్నీ ఫ్రీ

EPFO Portals for Free Services : ఆ EPFO సర్వీసులన్నీ ఫ్రీ

EPFO Portals for Free Services : మీకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతా ఉందా? అయితే మీ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సంబంధిత పనుల కోసం ఇతరులపై ఆధారపడకుండా, మీరే స్వయంగా పూర్తి చేసుకోండి. EPFO స్పష్టం చేసిన దాని ప్రకారం, వారి సేవలు పూర్తిగా ఉచితం వాటిని పొందేందుకు మీరు ఇంటి నుంచి కదలకుండానే అన్ని పనులు చేసుకోవచ్చు.

థర్డ్ పార్టీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండండి :
సైబర్ కేఫ్‌లు, ఫిన్‌టెక్‌లు, లేదా ఏజెంట్లు వంటి థర్డ్ పార్టీ సంస్థలను మీ పీఎఫ్ పనుల కోసం సంప్రదించవద్దు అని EPFO తీవ్రంగా హెచ్చరిస్తోంది. ఈ సంస్థలు ఉచితంగా లభించే EPFO సేవలకు కూడా డబ్బు వసూలు చేయడమే కాకుండా, మీ వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. మీ UAN నంబర్, పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి.

అధికారిక పోర్టల్స్, యాప్‌లను ఉపయోగించండి
EPFO సేవలను పొందేందుకు అధికారిక EPFO పోర్టల్ (www.epfindia.gov.in) మరియు ఉమంగ్ (UMANG) యాప్లను మాత్రమే ఉపయోగించండి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మీరు క్లెయిమ్ దరఖాస్తులు, ఖాతాల బదిలీలు, KYC అప్‌డేట్‌లు వంటి ఎన్నో సేవలను ఉచితంగా పొందవచ్చు. పీఎఫ్ సేవలపై ఏమైనా సందేహాలుంటే, EPFO హెల్ప్ డెస్క్‌లు లేదా ప్రాంతీయ కార్యాలయాల్లోని పీఆర్‌ఓలను సంప్రదించండి. వారి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

గ్రీవెన్స్‌ల పరిష్కారంలో వేగం
EPFO ఖాతాదారులు నమోదు చేసే ఫిర్యాదులు CPGRAMS (సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) లేదా EPFiGMS (EPFO గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) లలో నమోదు చేయబడతాయి. వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో లక్షల ఫిర్యాదులు అందగా, వాటిలో 98 శాతం ఫిర్యాదులను EPFO సకాలంలో పరిష్కరించింది.

- Advertisement -


EPFO కీలక సంస్కరణలు: పీఎఫ్ సేవలు మరింత సులభతరం!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు పీఎఫ్ సేవలను మరింత వేగవంతం, సరళతరం మరియు పారదర్శకం చేసేందుకు అనేక కీలక సంస్కరణలు చేపట్టింది. ఈ మార్పులు ఖాతాదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.

ముఖ్య సంస్కరణలు ఇవే:
KYC అప్‌డేషన్ సులభతరం: ఇకపై ఖాతాదారులు తమ ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా తమ ప్రొఫైల్ సమాచారాన్ని సులభంగా మార్చుకోవచ్చు. దీనివల్ల KYC వివరాలను అప్‌డేట్ చేయడం మరింత వేగంగా జరుగుతుంది.

ఖాతా బదిలీల వేగం: ఉద్యోగి ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి మారినప్పుడు, వారి పీఎఫ్ ఖాతా బదిలీ ప్రక్రియను EPFO వేగవంతం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ అంగీకారం లేకుండానే ఈ బదిలీని పూర్తి చేయవచ్చు.

బ్యాంకు వివరాల లింకింగ్ సులభం: ఉద్యోగి తమ బ్యాంకు ఖాతా వివరాలను EPFOతో లింక్ చేయడానికి కంపెనీ అప్రూవల్ పొందాల్సిన అవసరాన్ని తొలగించారు. ఇది ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తుంది.


రాంగ్ మెంబర్ ఐడీ తొలగింపు: ఒకవేళ ఏదైనా పీఎఫ్ ఖాతాలో తప్పుగా మెంబర్ ఐడీ చేరితే, దానిని సులభంగా తొలగించడానికి ‘డీలింక్’ అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు.

ఉమంగ్ యాప్ ద్వారా మెరుగైన సేవలు: ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీతో ఉమంగ్ యాప్ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా EPFO పాస్‌బుక్ వీక్షించడం, KYC అప్‌డేట్‌లు, క్లెయిమ్ సబ్మిషన్స్ వంటి సేవలను నేరుగా యాప్ నుంచే పొందవచ్చు.


క్లెయిమ్ సెటిల్‌మెంట్ సరళీకరణ: పీఎఫ్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ కోసం చెక్ లీఫ్ లేదా బ్యాంకు పాస్‌బుక్‌లను సమర్పించాల్సిన అవసరాన్ని EPFO తొలగించింది. ఇది క్లెయిమ్‌ల తిరస్కరణ రేటును తగ్గించి, ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితి పెంపు: ఆరోగ్య సమస్యలు, ఇంటి నిర్మాణం, వివాహం, విద్య వంటి కారణాలతో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే వారికి ‘ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్’ ద్వారా అందించే మొత్తాన్ని రూ. 1 లక్షకు పెంచారు. 2024-2025లో 2.34 కోట్ల క్లెయిమ్‌లు ఆటో మోడ్‌లో సెటిల్ అయ్యాయి.

కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ (CPPS): పెన్షన్ పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు EPFO సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS)ను ప్రవేశపెట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News