Sunday, December 8, 2024
HomeNewsJanasena party: జనసేన పార్టీ ఆఫీసులో అగ్నిప్రమాదం

Janasena party: జనసేన పార్టీ ఆఫీసులో అగ్నిప్రమాదం

Janasena party: విశాఖపట్టణంలోని జనసేన పార్టీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. నగరంలోని గోపాలపట్నం ఇంద్రనగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదానికి గత కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News