HomeNewsChoutuppal: రూటు మార్చుకోండి.. NH-65పై వాహనాల రద్దీ

Choutuppal: రూటు మార్చుకోండి.. NH-65పై వాహనాల రద్దీ

Choutuppal: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌- 65)పై శనివారం తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. దసరా సెలవుల నేపథ్యంలో నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరడంతో కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాలతో రహదారి కిక్కిరిసింది. చౌటుప్పల్‌ పట్టణంలో ప్లైఓవర్‌ నిర్మాణం కారణంగా వాహనాలు నెమ్మదించాయి. నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణానికి అరగంటకుపైగా సమయం పడుతుండడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

- Advertisement -

పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు వాహనాలు బారులుదీరుతున్నాయి. సాంకేతిక సమస్యలు, ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని చౌటుప్పల్‌ పరిధిలోని లక్కారం నుంచి వలిగొండ మీదుగా చిట్యాల వైపు పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నల్లగొండ ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ ఆదేశాల మేరకు చిట్యాల పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద ఉన్న యూటర్న్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కెట్‌పల్లి సీఐ సురేశ్‌ చిట్యాలలో ట్రాఫిక్‌ రద్దీని పరిశీలించి ఎస్‌ఐ వెంకట్‌రెడ్డితోపాటు సిబ్బందికి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News