Gajwel: వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ మహా లక్ష్మీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దివ్యదర్శన భాగ్యం కల్పించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు శ్రీ విద్యాధరి అమ్మవారికి విశేషాభిషేకం, గణపతి పూజ, సుప్రభాతం, గిరి ప్రదక్షణ, రాజోపచార పూజలు, చండీ హోమం ఘనంగా నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు.


