గాంధారి (తెలుగు ప్రభ ) : గాంధారిమండలంలోని గండివేట్ పరిధిలోని పల్లి, మేడపల్లి, గౌరారం మొదలైన గ్రామాలకు చెందిన రైతులు విద్యుత్ కోతలపై నిరసన వ్యక్తం చేశారు. నర్సాపూర్, చిన్నాపూర్ గ్రామాల రైతులు విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసింది.
పార్టీలకతీతంగా రైతులంతా ఒక్కటై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన చేపట్టారు. వ్యవసాయ పనులకు విద్యుత్ అంతరాయం కలగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తొలగించి, సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై అధికారులు స్పందించి, విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

