2025 నుండి 2039 లోపు పుట్టిన పిల్లలందరు జనరేషన్ బీటా లోకి వస్తారు. ఈ 15 ఏళ్లు లో పుట్టిన పిల్లలందరూ జనరేషన్ బీటా(బీటా బేబీస్) గా పరిగణించడం జరుగుతుంది. భారతదేశంలో మొదటి జనరేషన్ బీటా బేబీ మిజోరాంలో పుట్టాడు. జనవరి 1,2025 అర్ధ రాత్రి 12.30 కి పుట్టిన అబ్బాయి కి ఫ్రాంకీ రెమృత్దిక జడంగ్ గా నామకరణం చేసారు.
ఒకే తరహా జీవన విధానం,కట్టుబాట్లు, అభిరుచులు, సాంప్రదాయాలు, సాంకేతిక పరిణామాలు షేర్ చేసుకునే వారిని జనరేషన్ అంటారు. ఈ తరహాలో జనరేషన్ కి పేర్లు పెట్టడం 1901 లో ప్రారంభం అయింది.
ఈ జనరేషన్ బీటా లో పుట్టిన పిల్లలు అందరూ ఎక్కువ గా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కి అనుసంధానం అయ్యి ఉంటారు. సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ (AI టూల్స్) వంటి నూతన సాంకేతికతకు అనుగుణంగా వీరి జీవన విధానం ముడిపడి ఉంటుంది.