Tuesday, September 17, 2024
HomeNewsGodavarikhani: మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్​ డాగ్స్

Godavarikhani: మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్​ డాగ్స్

గోదావరిఖని బాపుజీనగర్ లో  గోదావరిఖని ఎ.సి.పి. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో  కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాలనీలో ఇండ్లలలో తనిఖీలు నిర్వహించామనీ గోదావరిఖని ఏ.సి పి. రమేష్ అన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ  మాట్లాడుతూ…. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , కాలనీలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు.

- Advertisement -

సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.  వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువ త్రాలను కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా మారకుండా కఠిన చర్యలు తీసికుంటామన్నారు. ఈ క్రమంలో మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్​ డాగ్స్​( మత్తు పదార్థాలను గుర్తించుటకు శిక్షణ పొందిన) ను కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో వినియోగించామని అన్నారు.


ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం .రమేష్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్, ఇంద్ర సేనా రెడ్డి, ఎస్ఐలు భూమేష్, రమేష్ శ్రీనివాస్, రామగుండం ఎస్ఐ సమ్మయ్య, గోదావరిఖని 2టౌన్ ఎస్.ఐ.ఎస్.కె.ఫరీద్ అహ్మదుల్లా  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News