Monday, June 16, 2025
HomeNewsSBI Home Loan: ఎస్బిఐ కస్టమర్లకు శుభవార్త .. గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు

SBI Home Loan: ఎస్బిఐ కస్టమర్లకు శుభవార్త .. గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు

SBI Home Loan Interest Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ గృహ రుణ రేట్లను తగ్గించింది. ఆర్బిఐ రెపో రేటును తగ్గించిన తర్వాత ఎస్బిఐ ఇబిఎల్ఆర్( EBLR), గృహ రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు, ప్రత్యేక డిపాజిట్ పథకం రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రుణ రేట్లలో మార్పు జూన్ 15 నుంచి అమలులోకి వస్తుంది. దీనితో గృహ రుణాలపై వడ్డీ రేటు ఇప్పుడు 7.5-8.45 శాతం మధ్య ఉండే అవకాశముంది. బ్యాంక్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ (444 రోజులు) పై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

- Advertisement -

ఎస్బిఐ గృహ రుణాలు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR)కికు అనుసంధానించి ఉంటాయి. దీంతో రెపో రేటులో మార్పులు బ్యాంక్ EBLRని కూడా ప్రభావితం చేస్తాయి. రెపో రేటు తగ్గినప్పుడు, EBLR తగ్గుతుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా చౌకగా మారతాయి. మరోవైపు, రెపో రేటు పెరిగినప్పుడు EBLR పెరుగుతుంది. ఇది గృహ రుణంపై వడ్డీని పెంచుతుంది, ఇది EMIపై ఖర్చును కూడా పెంచుతుంది. బ్యాంక్ ప్రస్తుత EBLR 8.15 శాతం ఉంది. ఈ వడ్డీ రేటు కస్టమర్ల CIBIL స్కోరు, రుణ కాలపరిమితి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. గతంలో రిజర్వు బ్యాంక్ 2025 జూన్ 6న రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో 6.00 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గింది.

ఎస్బిఐ నిర్ణయంతో రుణంపై వడ్డీ తక్కువగా ఉంటే, EMI కూడా తక్కువగా ఉంటుంది. ఇది వారి పొదుపును పెంచుతుంది. రెపో రేటు లింక్డ్ రేటు (RLLR)తో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ రేటుపై రుణం తీసుకున్న కస్టమర్లకు ఇప్పుడు వారి EMI కూడా తగ్గుతుంది. అయితే, మీరు స్థిర రేటుపై రుణం తీసుకుంటే, తగ్గిన వడ్డీ రేటు ప్రయోజనం మీకు లభించదు. ఈ కాలంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో ఎటువంటి మార్పు ఉండదని SBI తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News