సాధారణంగా ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగితే, ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అయితే ఆ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. నిమ్మకాయలో ఉండే పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అలసిపోయినప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు గ్లాస్ నిమ్మరసం తాగితే రిఫ్రెష్ అవుతాం. ఇది తక్షణమే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ క్రమంలో రోజూ ఒక గ్లాస్ నిమ్మకాయ నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
నిమ్మకాయ నీరులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
నిమ్మకాయ నీరు జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువ తినకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా, సులభంగా బరువు తగ్గవచ్చు.
గోరువెచ్చని నిమ్మకాయ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అమ్లత, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమన కలిగిస్తుంది. క్రమం
నిమ్మకాయలోని ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి చాలా మంచివి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి, మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
నిమ్మకాయ లో ఉండే విటమిన్ C, ఇతర పోషకాల సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.