భారీ వర్షాలపై అధికారులతో హోం- విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష
జిల్లా కలెక్టర్లు / అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
బంగాళాఖాతంలోని వాయుగుండం
అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం
దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
తీరం వెంబడి గంటకు 45-55కిమీ వేగంతో ఈదురు గాలులు
రేపు చాలచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు
రానున్న రెండు రోజులు మరింత అప్రపమత్తంగా ఉండాలి
ఇకపై ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచన
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి
త్వరతగతిన రెస్క్యూ ఆపరేషన్స్ జరగాలి
ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూ ఎస్, హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి
ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ , పడిన చెట్లు వెంటనే తొలగించాలి
ప్రజలు రోడ్ల మీద నీరు పూర్తిస్థాయిలో తగ్గేవరకు బయటకు రాకూడదు
ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలి