Thursday, January 22, 2026
HomeNewsHrbhajan Singh: RCB విషాదం.. హర్భజన్ పోస్ట్ రచ్చ

Hrbhajan Singh: RCB విషాదం.. హర్భజన్ పోస్ట్ రచ్చ

Harbhajan Singh : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 టైటిల్ విజయం విషాదంగా మారిపోయింది. విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కొత్త వివాదానికి దారితీసింది.

ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఆర్‌సీబీ అభిమానుల దుర్మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటన అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం, ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని, ఆయన బాధితులను పరామర్శించడానికి కూడా ముందుకు రాలేదని పలువురు విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు మరింత దుమారాన్ని రేపింది. “సమస్యలు సృష్టించి, తమను తాము బాధితులుగా చెప్పుకునే వారికి దూరంగా ఉండాలి” అని హర్భజన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వగా, నెటిజన్లు, క్రికెట్ అభిమానులు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు.

ఈ పోస్ట్ విరాట్ కోహ్లీని ఉద్దేశించే చేశారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత కోహ్లీ ప్రవర్తనపై వస్తున్న విమర్శలకు హర్భజన్ ఈ విధంగా పరోక్షంగా స్పందించారని విశ్లేషిస్తున్నారు. అయితే, కోహ్లీ అభిమానులు మాత్రం హర్భజన్ పోస్ట్‌ను ఖండిస్తూ, కోహ్లీని అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని వాదిస్తున్నారు.

ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్లందరిపై విమర్శలు చేసిన నేపథ్యంలో, హర్భజన్ పోస్ట్ ఈ చర్చను మరింత తీవ్రతరం చేసింది. అసలు హర్భజన్ ఉద్దేశ్యం ఏమిటి, ఆయన ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ పోస్ట్ చేశారనేది తెలియాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారం ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల దుర్ఘటనతో ముడిపడి, క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News