Saturday, November 23, 2024
HomeNewsHyd: సిపిఆర్ నిర్వహణపై అవగాహన పెంచుకోండి

Hyd: సిపిఆర్ నిర్వహణపై అవగాహన పెంచుకోండి

సిపిఆర్ ప్రాథమిక చికిత్స అత్యవసర నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ జి.శంకర్ రాజు అన్నారు. ఈ మేరకు అమీర్‌పేట‌ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో సీపీఆర్ నిర్వహణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దైనందిన జీవితంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స, సీపీఆర్ ఇతర ప్రాథమిక అత్యవసర నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిఐ పి.సురేష్ ,ఎస్సై సి.హెచ్.జ్యోతి, చక్రధర్, చిరంజీవి, ప్రసాద్ లతో పాటు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ వైద్యులు ఎం.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News