Drugs:హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు కావడం సంచలనం సృష్టించింది. ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ డ్రగ్స్ సేవిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో ఇద్దరు పెడ్లర్లతో పాటు ఎనిమిది మంది ట్రాన్స్‌జెండర్ (గే) వినియోగదారులు ఉండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిందితుల నుంచి వంద గ్రాముల ఎండీఎంఎస్ స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ‘Grinder’ అనే యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక నైజీరియన్‌ను కూడా అరెస్ట్ చేశారు. యువతలో, ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ ముఠాలో ‘గే’ లు కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
డ్రగ్స్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ‘నశా ముక్త్ భారత్’ వంటి కార్యక్రమాలతో పాటు, డ్రగ్స్ వ్యతిరేక చట్టాలను మరింత పదును పెడుతున్నాయి. పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్ వంటి విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డీ-ఎడిక్షన్ హెల్ప్‌లైన్‌లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.


