HomeNewsHyderabad: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలి

Hyderabad: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలి

Hyderabad: జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గడువుతో కూడిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బృందం కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించింది. ప్రెస్ క్లబ్ హైదరాబాద్‌కు నామమాత్రపు ధరకు స్థలం కేటాయింపు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

ప్రెస్ క్లబ్ స్థలానికి సంబంధించిన ఫైల్ తన వద్ద పెండింగ్‌లో ఉందని, ఒకటి రెండు రోజుల్లో దాన్ని పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వారికుప్పల, కోశాధికారి రమేష్ వైట్ల, సీనియర్ జర్నలిస్టులు ఆర్. రవికాంత్ రెడ్డి, నేమాని భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News