సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో మాట్లాడుతూ..ప్రభాస్ , మహేష్ బాబు , రవితేజ , చిరంజీవి అభిమానుల సపోర్ట్ కోరారు. సినిమాలు వేరు , రాజకీయాలు వేరు అన్నారు. గత ఐదు రోజులుగా పవన్ కళ్యాణ్ జనసేన ‘వారాహి విజయ యాత్ర’ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏ రాజకీయ పార్టీకి కూడా రానటువంటి రెస్పాన్స్ , ఈ వారాహి యాత్ర ద్వారా జనసేన పార్టీ కి వస్తుంది. ఇదేమి జనసేన కు కొత్త కాదు. పవన్ కళ్యాణ్ బయటకు వస్తే జనాలు తండోపతండాలుగా రావడం కామనే.
కాగా నిన్న కాకినాడ లో ఏర్పటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ..అగ్ర హీరోల తాలూకా అభిమానుల సపోర్ట్ కావాలని కోరారు. ‘సినిమాల పరంగా మీరు ఎంత మంది హీరోలను అయినా అభిమానించొచ్చు, కానీ రాజకీయాల్లో సరైన నాయకుడిని ఎంచుకునే విషయం అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఓట్లు వెయ్యాలి. మహేష్ బాబు అభిమానులకు, ప్రభాస్ అభిమానులకు , రామ్ చరణ్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు , చిరంజీవి అభిమానులకు మరియు రవితేజ అభిమానులకు ఒక్కటే చెప్తున్నాను. వారందరూ నాకు ఇష్టమే, మేమంతా కలిస్తేనే చిత్ర పరిశ్రమ. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి, భవిష్యత్తు కోసం అడుగెయ్యండి ‘ అంటూ పవన్ కళ్యాణ్ అడగడం అందరినీ ఎంతో సంతోషానికి గురి చేసింది.
ఈ మధ్య పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలను మరింత పదును పెట్టి, ఆవేశంతో మాత్రమే కాకుండా ఆలోచనతో మాట్లాడుతూ అందర్నీ ఆలోచింప చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల గురించి, అరాచకాల గురించి పూస గుచ్చినట్టుగా వివరిస్తూ జనాల్లో మార్పు వచ్చేలా చేస్తున్నారు. ఆయన ప్రసంగాలకు రీసెంట్ సమయం లో ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అద్భుతమైన స్పందన లభిస్తుంది. సోషల్ మీడియా లో ఇదే చెపుతున్నారు. మా సపోర్ట్ మీకే అంటున్నారు. మరి ఈ సపోర్ట్ పవన్ కళ్యాణ్ కు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.