Friday, February 13, 2026
HomeNewsT20 World Cup 2026: బంగ్లాదేశ్‌ వివాదంపై మౌనం వీడిన శ్రీలంక.. అసలు కారణం ఇదేనట!

T20 World Cup 2026: బంగ్లాదేశ్‌ వివాదంపై మౌనం వీడిన శ్రీలంక.. అసలు కారణం ఇదేనట!

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యంగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు బంగ్లాదేశ్ టోర్నీ నుంచే వైదొలిగేలా చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సహ ఆతిథ్య దేశమైన శ్రీలంక తాజాగా మౌనం వీడింది.

- Advertisement -

అసలేం జరిగింది?
భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. కోల్‌కతా, ముంబైలలో జరగాల్సిన తమ నాలుగు మ్యాచ్‌లను తరలించాలని బంగ్లా పట్టుబట్టింది. అయితే, ఈ విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నిర్ణయం తీసుకోవడానికి బంగ్లాదేశ్‌కు 24 గంటల గడువు ఇచ్చింది. బంగ్లాదేశ్ తన పంతం వీడకపోవడంతో, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుండి తొలగించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది.

బంగ్లాకు మద్దతుగా పాక్..
బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా పాకిస్థాన్ కూడా ఈ మెగా టోర్నీని బహిష్కరించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని లేదా టోర్నీ నుంచే తప్పుకోవాలని పాకిస్థాన్ భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: T20 World Cup 2026 -టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. తిలక్ వర్మ రీ-ఎంట్రీ ఫిక్స్! మరో ఇద్దరు కూడా..

శ్రీలంక ఏమన్నదంటే?
ఈ వివాదంపై సహ ఆతిథ్య దేశమైన శ్రీలంక ఇన్నాళ్లూ మౌనంగా ఉంది. తాజాగా శ్రీలంక క్రికెట్ కార్యదర్శి బందుల దిస్సానాయకే స్పందిస్తూ.. తాము తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. “భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్.. ఈ మూడు మాకు స్నేహపూర్వక దేశాలే. వారి మధ్య ఉన్న ప్రాంతీయ వివాదాల్లో మేము తలదూర్చదలచుకోలేదు” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో ఏ దేశానికైనా టోర్నీలు నిర్వహించాల్సి వస్తే తాము సిద్ధమని పేర్కొన్నారు.

భారత్ – పాక్ పోరుపై ప్రత్యేక దృష్టి
రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ తన మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. భారత్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ కూడా లంకలోనే జరగనుంది. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్‌ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని శ్రీలంక క్రీడల మంత్రి సునీల్ కుమార గమగే తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News