ముఖ సౌందర్యంలో దంతాలు ముఖ్యమైనవి. పళ్లు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతూ ఉంటే.. మనలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది.. అందమైన చిరునవ్వుకు కారణంగా కూడా మెరిసే దంతాలే అని చెప్పాలి. అదే పళ్ళు పాచి పట్టి పసుపు రంగులోకి మారితే.. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అందరిలో ఉన్నప్పుడు మనసారా నవ్వలేకపోతుంటారు.
అందుకే మన నోటి పరిశుభ్రత, తెల్లటి దంతాల విషయంలో తప్పనిసరని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందుకోసం అరటి పండు తొక్క కూడా చక్కటి హోంరెమిడీగా పనిచేస్తుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా మార్చి, పొడి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. అరటిపండ్లు తినడం, వాటిని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో అనేక లాభాలు ఉన్నాయి.
దంతాలపై పేరుకుపోయిన పసుపు మరకలను తొలగించడానికి అరటి తొక్కను వారానికి 2-3 సార్లు దంతాలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల దంతాలు మెరుస్తాయి. అరటిపండు తొక్కను దంతాల మీద రుద్దిన తర్వాత గోరువెచ్చని నీటితో నోరు కడుక్కోవాలి.
అయితే, అరటి తొక్కలో బోలేడు లాభాలు నిండివున్నాయి. అందులో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి దంతాలు తెల్ల రంగులో మెరిసేలా చేయడంలో సాయపడతాయి. అరటి తొక్కతో పాటు బేకింగ్ సోడా కలిపితే.. ఈ రెమిడీ అద్భుతంగా పనిచేస్తుంది.
అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. దంతాల మీద రుద్దడం వల్ల చిగుళ్లకు తగిన పోషకాహారం లభించి పసుపురంగు పోతుంది. దీని వల్ల చాలా మందికి చిగుళ్లలో మంట వస్తుంది. అలాంటి వారు దీనిని ఉపయోగించే ముందు డెంటిస్ట్ ని సంప్రదించాలి.
మరొక పద్ధతిలో ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకుని, దానికి కొంచెం నీళ్ళు పోసి పేస్ట్‌లా మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్‌ని అరటిపండు తొక్కతో మిక్స్ చేసి దంతాల మీద స్మూత్‌గా అప్లై చేయాలి. రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత నీటితో వాష్ చేసుకోవాలి. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.