Tuesday, September 10, 2024
HomeNewsIllanthakunta: స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం

Illanthakunta: స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం

ఆనంతారం గ్రామంలో..

ఇల్లంతకుంట మండలం ఆనంతారం గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ శశికళ, స్పెషల్ ఆఫీసర్ బుద్ధ నాయుడు గ్రామంలో గ్రామసభ జరిపి ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచినపుడే రోగాలు దరి చేరవని, మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను పెంచాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో గుంతలు ఉన్న వద్ద గ్రావెల్స్ వేసి చదును చేసినందుకు పంచాయతీ సెక్రటరీని విజయలక్ష్మిని అభినందించారు. ఇంకా ఎక్కడైనా గుంతలు ఉంటే వెంటనే గ్రావెల్స్ వేసి చదును చేయాలని తెలిపారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చల్ల నారాయణ, మాజీ ఎంపీటీసీ తీగల పుష్పలత, మాజీ వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News