Wednesday, September 11, 2024
HomeNewsIMD alerts another cyclone: మళ్లీ తుపాను హెచ్చరించిన ఐఎండీ

IMD alerts another cyclone: మళ్లీ తుపాను హెచ్చరించిన ఐఎండీ

ఐఎండి సూచనల ప్రకారం ఆవర్తన ప్రభావంతో పశ్చిమమధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

- Advertisement -

దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

మరోవైపు గోదావరి నది వరద ప్రవాహం పెరుగుతుందని బుధవారం రాత్రి 8 గంటల నాటికి భద్రాచలం వద్ద 44.4 అడుగుల నీటిమట్టం ఉందని, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,00,706 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. రేపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. కృష్ణానది వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని ప్రకాశం బ్యారేజి వద్ద 8 గంటల నాటికి 3.08 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు.

కృష్ణా, గోదావరి నదీ పరివాహాక ప్రజలు, లంక గ్రామ వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News