IND vs NZ 5th T20 Live Streaming: టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు (జనవరి 31) ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ రాత్రి 6:30 గంటలకు వేస్తారు. మ్యాచ్ 7 గంటలకు మెుదలుకానుంది. ఈ హైవోల్టేజ్ పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియోస్టార్ లో వీక్షించవచ్చు. సొంత గడ్డపై ఆడుతున్న సంజు శాంసన్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. గత మ్యాచ్‌లో విఫలమైన భారత్, ఈసారి పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగనుంది.
పిచ్ రిపోర్ట్
తిరువనంతపురం పిచ్ సాధారణంగా బౌలర్లకు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఆరంభంలో మంచి సహకారాన్ని అందిస్తుంది. అయితే, ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇక్కడ కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది. రాత్రి పూట మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు బంతిని ఎదుర్కోవడం సులభం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
వాతావరణ సూచన
ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. కానీ కేరళ తీర ప్రాంతం కావడంతో తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది ఆటగాళ్లకు కాస్త సవాలుగా మారవచ్చు.
Also Read: Indian Cricket Team -పద్మనాభస్వామి సన్నిధిలో టీమిండియా ప్లేయర్స్
హెడ్-టు-హెడ్ రికార్డు (T20Is)
భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు టీ20ల్లో 30 మ్యాచుల్లో తలపడగా.. టీమ్ ఇండియా 18 మ్యాచుల్లోనూ, కివీస్ 12 మ్యాచుల్లోనూ విజయం సాధించాయి. ఇవాళ జరిగే మ్యాచ్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ పోరులో గెలిచి ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీలోకి అడుగుపెట్టాలని రెండు జట్లు భావిస్తున్నాయి.
Also Read: Viral Video -“మా చెట్టాను డిస్టర్బ్ చేయకండి”.. సంజూపై సూర్య కామెంట్స్ వైరల్!
ఇరు జట్లు ప్లేయింగ్ XI అంచనా
భారత్ (India): అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ (New Zealand): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (కీపర్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, ఇష్ సోధి, కైల్ జెమీసన్, జాకబ్ డఫ్ఫీ.

