IPL Auction| క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడింది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం కార్యక్రమం జరగనుంది. అయితే మెగా వేలం టైమింగ్స్‌ను మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు వేలం సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 గంటలకు మార్చింది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ జరిగే సమయంలో వేలం జరగనుంది. పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఉదయం 7.50 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. దీంతో మ్యాచ్, వేలం టైమింగ్స్ క్లాష్ కాకుండా వేలంను అరగంట వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే మెగా వేలానికి మొత్తంగా 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురిని జత చేసింది. అయితే వేలంలో 204 మందిప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఈసారి టీమిండియా స్టార్ ఆటగాళ్లు వేలంలో ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎవరు ఎక్కువ ధర పలుకుతారనే ఉత్కంఠ అభిమానుల్లో ఏర్పడింది.