Beetroot: సూపర్ ఫుడ్స్ విషయానికి వస్తే బీట్‌రూట్ ఈ జాబితాలలో అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యాంగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ఇందులో ఫోలేట్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే, చాలా మంది పచ్చి బీట్‌రూట్ తినడం మంచిదని అనుకుంటారు. మరికొందరు ఉడికించిన బీట్‌రూట్ కూడా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇప్పుడు ఆరోగ్యానికి పచ్చి బీట్ రూట్ లేదా ఉడకబెట్టి బీట్ రూట్ ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
100 గ్రాముల పచ్చి బీట్‌రూట్‌లో..
కేలరీలు: 43
కార్బోహైడ్రేట్లు: 9.6 గ్రాములు
ఫైబర్: 2.8 గ్రాములు
చక్కెర: 6.8 గ్రాములు
ప్రోటీన్: 1.6 గ్రాములు
కొవ్వు: 0.2 గ్రాములు
విటమిన్ B9 (ఫోలేట్): 109 మైక్రోగ్రాములు
విటమిన్ C: 4.9 మిల్లీగ్రాములు
పొటాషియం: 325 మిల్లీగ్రాములు
ఐరన్: 0.8 మిల్లీగ్రాములు
మెగ్నీషియం: 23 మిల్లీగ్రాములు
పచ్చి బీట్‌రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫోలేట్ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. పచ్చి బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు అథ్లెట్లలో రక్తపోటును తగ్గించి, స్టామినాను పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
Also read: Ice Cream: ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా అయితే కచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
100 గ్రాముల ఉడికించిన బీట్‌రూట్‌లో..
కేలరీలు: 44
కార్బోహైడ్రేట్లు: 10.0 గ్రాములు
చక్కెరలు: 7.0 గ్రాములు
ఫైబర్: 2.0 గ్రాములు
ప్రోటీన్: 1.7 గ్రాములు
కొవ్వు: 0.1 గ్రాములు
విటమిన్ B9 (ఫోలేట్): సుమారు 80-100 మైక్రోగ్రాములు
పొటాషియం: 300-325 మిల్లీగ్రాములు
మాంగనీస్: 20 మిల్లీగ్రాములు
ఐరన్: 0.7-0.9 మిల్లీగ్రాములు
ఉడికించిన బీట్‌రూట్‌లోని ఫైబర్ మృదువుగా అవుతుంది. ఇది జీర్ణం కావడానికి సులభం అవుతుంది. ఉడికించిన బీట్ రూట్ లో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కండరాల పనితీరుకు సహాయపడతాయి. ఉడికించడం వల్ల మంచి మొత్తంలో ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది కణాల మరమ్మత్తు, మెదడు పనితీరుకు ఎంతో మేలు చేస్తుంది. కాకపోతే, ఉడికించిన బీట్ రూట్ లో తక్కువ భాగంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇందులో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఆరోగ్యానికి ఏ బీట్ రూట్ ప్రయోజనకరంగా ఉంటుంది?
పచ్చి బీట్‌రూట్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరోవైపు.. ఉడికించిన బీట్‌రూట్‌లోని ఫైబర్ మృదువుగా మారుతుంది. ఉడికించిన బీట్ రూట్ లో విటమిన్ సి, కొన్ని యాంటీఆక్సిడెంట్లు పోతాయి. అయితే, దీని తినడం వల్ల కడుపులో తేలికగా ఉంటుంది. కాగా, బీట్‌రూట్‌ను పచ్చిగా లేదా ఉడికించిన వాటి సహజ తీపి మాత్రం పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పచ్చి బీట్‌రూట్ ఎక్కువ పోషకమైనది.

