HomeNewsKruthi sanan: సూపర్‌వుమన్‌గా నటించాలనేది నా కోరిక.. కృతిసనన్

Kruthi sanan: సూపర్‌వుమన్‌గా నటించాలనేది నా కోరిక.. కృతిసనన్

Kruthi sanan: నేషనల్ అవార్డ్ విన్నర్ కృతిసనన్ తన నటనలోని కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘మిమి’ చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ భామ, రాబోయే రోజుల్లో పూర్తిగా భిన్నమైన జానర్లలో నటించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఒక వైపు రొమాంటిక్, డ్రామా చిత్రాలతో పాటు మరోవైపు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలపై ఆమె దృష్టి పెట్టారు. పుష్కర కాలం క్రితం టాలీవుడ్ లో ‘నేనొక్కడినే’ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచెయ్’ చిత్రంలోనూ, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తెలుగు, హిందీ బైలింగ్వల్ చిత్రం ‘ఆదిపురుష్’లోనూ ఆమె సందడి చేశారు. ఆ చిత్రాలేవీ ఆమెకు అనుకున్నంత గుర్తింపును ఇవ్వలేకపోయాయి. దాంతో బాలీవుడ్ చిత్రాలు చేస్తూ అక్కడ బిజీగా ఉంటున్నారు. ఇదిలావుండగా, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను కృతి పంచుకున్నారు. ముఖ్యంగా, భారతదేశంలో ఇప్పటివరకు పురుష సూపర్ హీరోలే ఎక్కువగా ఉన్నారని, ఆ లోటును భర్తీ చేస్తూ ఒక ‘సూపర్‌వుమన్’ పాత్రలో నటించాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టారు. కేవలం సూపర్‌హీరో పాత్రలే కాకుండా, నటిగా తనలోని నైపుణ్యాన్ని మరింత సవాలు చేసే మోరల్లీ కాంప్లెక్స్, ‘గ్రే షేడ్స్’ ఉన్న పాత్రలలో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. సినిమాల్లో నటనతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించాలనే కోరికను కూడా ఆమె బహిరంగంగా వ్యక్తం చేశారు.

- Advertisement -

‘దో పత్తి’, ‘తేరే ఇష్క్ మే’ వంటి విభిన్న చిత్రాలతో తనలోని వైవిధ్యాన్ని చాటుకున్న కృతి, త్వరలోనే యాక్షన్ అండ్ లేడీ ఓరియెంటెడ్ సూపర్‌హీరో జానర్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కృతిసనన్ ఆలోచనలు చూస్తుంటే, ట్రెండ్‌కు తగినట్లుగా తన లైనప్‌ను మార్చుకుంటూ పాన్-ఇండియా స్థాయిలో మరింత బలమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి ఆమె సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News