Itel City 100 launched: ఐటెల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. కంపెనీ ఐటెల్ సిటీ 100 పేరిట దీని తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ చెప్పవచ్చు. యూనిసోక్ T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అమర్చారు. 5200mAh బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్ కేవలం రూ. 8000 కంటే తక్కువ ధరలో రావడం విశేషం. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ధర
ఐటెల్ సిటీ 100 ధర భారతదేశంలో రూ.7,599గా కంపెనీ పేర్కొంది. ఈ పరికరం ఫెయిరీ పర్పుల్, నేవీ బ్లూ, ప్యూర్ టైటానియం కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్‌తో వినియోగదారులకు కంపెనీ రూ. 2999 విలువైన మాగ్నెటిక్ స్పీకర్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఫోన్ 100 రోజుల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌తో వస్తుంది.
ఫీచర్లు
కంపెనీ ఐటెల్ సిటీ 100 స్మార్ట్ ఫోన్‌లో HD + రిజల్యూషన్‌తో 6.75-అంగుళాల IPS డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డైనమిక్ బార్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ స్థాయి 700 నిట్‌ల వరకు ఉంటుంది. కంపెనీ ఫోన్‌లో 4GB రియల్, 8GB వర్చువల్ RAMను అందిస్తోంది. దీని వలన ఈ ఫోన్ మొత్తం RAM 12GB కి పెరుగుతుంది. ఈ ఫోన్ లో Unisoc T7250 చిప్ సెట్ అమర్చారు. OS గురించి చెప్పాలంటే..ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 లో పనిచేస్తుంది. ఫోన్ ఐటెల్ సూపర్ ఇంటెలిజెంట్ AI అసిస్టెంట్ ఐవానా 3.0 తో వస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం.. ఫోన్ లో 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. ఇదే సమయంలో సెల్ఫీ కోసం.. 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5200mAh బ్యాటరీతో వస్తున్న ఈ పరికరం 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. ఇక బయోమెట్రిక్ భద్రత కోసం.. ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కంపెనీ ఇందులో ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను కూడా అందిస్తోంది. ఫోన్ లో అందించిన అదనపు ఫీచర్లలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, IR బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ IP64 డస్ట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ను కూడా అందిస్తుంది.