రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం జడ్చర్ల రైతు వేదికలో రైతు రుణమాఫీ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులతో ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతు రుణమాఫీతో వ్యవసాయ విత్తనాలు ఎరువులను కొని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని, ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. రుణమాఫీతో రైతులు అప్పుల భారం నుంచి బయటపడతారని అన్నారు.
ఈ సందర్భంగా రైతులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ నగర్ జడ్పీ సీఈఓ రాఘవేందర్ రావు, జడ్చర్ల మండల వ్యవసాయ అధికారి గోపీనాథ్, జడ్చర్ల క్లస్టర్ ఏఈఓ నరసింహులు హాజరై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ చైతన్య చౌహన్, మల్లె బోయినపల్లి పిఎసిఎస్ చైర్మన్ పడాల మల్లేష్, బాదేపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నాయకులు శివకుమార్, జనార్దన్ రెడ్డి, బుక్క వెంకటేశం, గంగ్యా నాయక్, రాంప్రసాద్, బ్యాంక్ మేనేజర్లు, మండల పరిధిలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు.