Sunday, October 6, 2024
HomeNewsKalvakurthi: రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో అమ్మవారు

Kalvakurthi: రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో అమ్మవారు

ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నాయకులు తల్లోజు ఆచారి

కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో ఆదివారం నాల్గవ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది.ఈ దేవిని “అపరాజితాదేవి”గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది.
దేవాలయంలో ఉదయం నుండి ప్రాతః కాల పూజలతో మొదలుకొని అభిషేకము, ప్రత్యేక అలంకరణ గావించి దంపతులచే రెండు పర్యాయాలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా, లలితా సహస్ర నామాలు మరియు వేద పండితులచే వేద పఠనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తల్లోజు ఆచారి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.అనంతరం సాంస్కృతిక వినోద కార్యక్రమాలు, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ మరియు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది.

- Advertisement -


సాయంత్రం బతుకమ్మ పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రధానం చేశారు. బతుకమ్మ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బతుకమ్మ పాటలతో, దండియా కోలాటాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.

దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు తల్లోజు ఆచారికి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి, ఘనంగా సన్మానించారు. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు ఆర్యవైశ్య సంఘం , వాసవి క్లబ్, అవోప మరియు అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News