Sunday, July 7, 2024
HomeNewsKarimnagar: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య

Karimnagar: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య

శ్రీ చైతన్యపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ముందస్తు అడ్మిషన్లు, ప్రచారం నిర్వహిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వత్తాసు పలుకుతున్నారని, డీఈవో అండదండలతోనే విద్యా వ్యాపారం చేస్తున్నారని జిల్లా డీఈవోను సస్పెండ్ చేయాలని ఇటీవల ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆందోళన కార్యక్రమం సైతం చేపట్టారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంలో మర్మమేంటో అర్థం కావడం లేదు.

- Advertisement -

కరీంనగర్ లోని జ్యోతిరావుపూలే గ్రౌండ్ సమీపంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండానే, అసంపూర్తిగా ఉన్న భవనంలోనే శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం అడ్మిషన్లు, ప్రచారం నిర్వహిస్తున్నారని, సదరు పాఠశాలను సీజ్ చేయాలని డీఈఓ, ఎంఈవోలకు ఏఐఎస్ఎఫ్ నాయకులు సమాచారం ఇచ్చినప్పటికీ వారు స్పందించకపోవడం చూస్తుంటే వారికి ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి స్పందించి అనుమతులు లేకుండా అడ్మిషన్లు, ప్రచారం నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి మరి.

ఏఐఎస్ఎఫ్ డిమాండ్..

అనుమతి లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు అని అన్నారు. నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణం పూర్తి కాకుండానే అడ్మిషన్ లు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అడ్మిషన్ ఫీజు స్కూల్ ఫీజు పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని ఇకనైనా అనుమతి లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని శ్రీ చైతన్య విద్యాసంస్థలు సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News