ఈరోజు ఎపిసోడ్‌లో సౌర్య తీసుకున్న లాకెట్‌ను కార్తిక్ తీసుకుని మెడలో వేసుకుని సౌర్య గోల చేస్తుందని తీసి దీప చేతిలో పెడతాడు లోపల పెట్టమని ఇస్తాడు. మరోవైపు సుమిత్ర జోత్స్నకు ఏమి తెలియదు తన చేతిలో అన్ని నిర్ణయాలు పెట్టారు అని సుమిత్ర నిలదీస్తుంది. శివన్నారయణ కుడా నువ్వు రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్లక్కర్లేదు అని గట్టిగా చెబుతాడు. జోత్స్న నన్ను తీయద్దు నేను సీఈఓ గానే ఉంటాను అని అడుగుతుంది. నువ్వు సీఈఓ గా పనికిరావు అంటుంది. ఇంకో చాన్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తుంది.
మధ్యలో పారిజాతం కుడా జోత్స్న వైపు మాట్లాడుతుంది. ఆ కార్తిక్ ముందు నా పరువు తీసావు అని శివన్నారయణ అంటాడు. మొత్తానికి నువ్వు పేరుకే సీఈఓ గా ఉంటావు ఏ నిర్ణయం అయినా మాకు చెప్పే చేయాలి అని బుద్ధి చెప్తారు. పారిజాతాన్ని జోత్స్నతో మాట్లాడానికి వీలు లేదు అని చెప్తాడు. జోత్స్నకు జరిగిన అవమానం కి ఇంకా రగిలిపోయి దీప మీద కక్ష తీర్చుకోవాలని అనుకుంటుంది.
మరోవైపు కార్తిక్ నాన్న జరిగిన విషయం మీద ఫుల్‌గా హ్యాపీ అయిపోయి డ్యాన్స్ వేస్తాడు. తన మావయ్య పరువు పోయింది, సోషల్ మీడియాలో వాళ్ల పరువు పోయిందని సంతోష పడతాడు. జోత్స్న ఏమో జరిగిన విషయాల్ని గుర్తుచేసుకుని చంపలు వాయించుకుంటుంది. పారిజాతం వచ్చి జోత్స్నను మార్చడానికి ట్రై చేస్తుంది. జోత్స్నలో వచ్చిన మార్పును తనకి గుర్తుచేస్తుంది, మనం మనుషులము జంతువుల్లాగ మారకూడదు అని చెప్తుంది. జరగబోయే విషయాలు గురించి చెప్తుంది పారిజాతం. మీ టార్గెట్ సరిగ్గా లేదు అని రెచ్చగొడుతుంది.
మరోవైపు దీప చేతికి గాయం అయితే చేతిలో గిన్నె వదిలేస్తుంది. కార్తిక్ వచ్చి చేతి గాయాన్ని తగ్గించడానికి చేతికి పెయిన్ బామ్ రాస్తాడు. అలా కూర్చుని మాట్లాడుకుంటారు. దీప చేతికి పెయిన్ బామ్ రాయనివ్వకుండా ఉంటుంటే, కార్తిక్ ఏమో నాకు హాయిగా ఉంది. ఫ్యూచర్‌లో నీకు ఇన్ని సేవలు చేసాను అని చెప్పుకుంటా అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది..