Sunday, December 8, 2024
HomeNewsAP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం

AP Cabinet| ఉండవల్లిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

- Advertisement -

కీలక నిర్ణయాలు ఇవే..

ఏపీ లాండ్ గ్రాబింగ్ ప్రొటెక్షన్ బిల్ 2024: 1982 లో వచ్చిన “ఏపీ లాండ్ గ్రాబింగ్ ఆక్ట్” స్థానంలో కొత్త ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఆమోదించింది.

పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలో పనుల చెల్లింపులు: 2014-15 నుండి 2018-19 సంవత్సరాల మధ్య పూర్తి అయిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల బిల్లులకు ఆమోదం

ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ 1984 సవరణ: జ్యుడీషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసును 60 నుండి 61 సంవత్సరాలకు పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(GST) సవరణ బిల్లుకు ఆమోదం

ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024 బిల్లుకు కూడా ఆమోదం

స్పెషలైజ్డ్ డెవలప్‌మెంట్ అథారిటీలు: కుప్పం, పిఠాపురం ప్రాంతాలలో ఏరియా డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటుచేసేందుకు ఆమోదం.

సీఆర్డీఏ(CRDA) పరిధి విస్తరణ: సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి చేర్చేందుకు నిర్ణయం

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డిస్బర్సల్: 2024-25 విద్యా సంవత్సరం నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ను విద్యార్థుల కళాశాల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేసేందుకు నిర్ణయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News