Kingfisher: తెలంగాణ లో కేఎఫ్ బీర్లు బంద్

0
31

ప్రముఖ బ్రూవరీస్ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ కి తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం అలాగే గడిచిన 5 ఏళ్లలో సంస్థ ప్రతిపాదనల మేరకు బీర్ల ధర పెంచకపోవడం తో యాజమాన్యం ఇక మీదట తెలంగాణ లో తమ సంస్థ కి చెందిన బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.

తెలంగాణ బెవేరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) 2019-20 నుండి బీర్ల ధరలు పెంచకపోవడం తో యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసింది.అలాగే ప్రభుత్వం నుండి రావల్సిన పాత బకాయిలు కూడా రాకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనిటెడ్ బ్రూవరీస్ సంస్థ సీఈఓ వివేక్ గుప్త తెలిపారు.

యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కి చెందిన ప్రముఖ బ్రాండెడ్ బీర్లు కింగ్ ఫిషర్ , హయిన్కెన్ బీర్లు ఇక మీదట తెలంగాణ ప్రజలు కి అందుబాటులో ఉండవు అనే వార్త అటు ప్రభుత్వం కి ఇటు ప్రజలకి తీవ్ర నిరాశ మిగిలిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here