HomeNewsKishan reddy: సేవా సంకల్ప్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..

Kishan reddy: సేవా సంకల్ప్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..

Kishan reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి చేసిన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవా సంకల్ప్’ వారోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా తర్నాకలో మహంకాళి జిల్లా ఇంటెలెక్చువల్ సెల్ ఇంచార్జి డాక్టర్ శ్రీరామ్ వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామాలు, వేలాది పట్టణాల్లో అనేక రకాల సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ నెల రోజుల వ్యవధిలో పేదలకు సహాయం రైతులు, బస్తీ వాసులకు సేవలు రక్తదాన శ్రమదానాలు ఆసుపత్రులలో పండ్లు- పాలు పంపిణీ పారిశుద్ధ్య, అంగన్వాడీ కార్యకర్తలను సత్కరించే అనేక సేవా కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు. పేదలు, మహిళలు పారిశుద్ధ్య కార్మికులకు సేవ చేయడం ద్వారా సామాజిక బాధ్యతను చాటు కోవాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సేవా స్ఫూర్తితో డాక్టర్ శ్రీరామ్ వెంకట్ ప్రజల మధ్యకు వెళ్లి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీ యమనిమంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహంకాళి జిల్లా ఇంటిలెక్చవల్ సెల్ ఇంచార్జి డాక్టర్ శ్రీరామ్ వెంకట్ మా ట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో తార్నాకలో సేవా కార్య క్రమాలను నిరంతరం కొనసాగిస్తూ సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలబడ తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, సామాజిక సేవకు మా వంతు కృషి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి,తార్నాక డివిజన్ అధ్యక్షుడు కంటేకరు ణాకర్, అలేటి అనూష, కృష్ణ గౌడ్, ప్రకాష్ గౌడ్, కుల శ్రీనివాస్, దేవా రాగి శ్రీనివాస్, శివ గౌడ్, పవన్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News