జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, బతుకమ్మ పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. బతుకమ్మ చీరెల ద్వారా చేనేతలకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ప్రశాంతి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ రాజనర్సింగరావు, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.