అయ్యప్ప స్వాములకు ముస్లిం నేత అన్నదానం చేశారు. మొగిలిపేట గ్రామానికి చెందిన విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్ అయ్యప్ప భక్తులకు అన్నదానం చేశారు. అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించి, వారితో కలసి భిక్ష చేశారు. గత కొన్నేళ్లుగా స్వాములకు భిక్ష చేస్తున్నట్లు, ప్రతి సంవత్సరం స్వాములకు భిక్ష ఇస్తున్నట్లు మహబూబ్ ఖాన్ తెలిపారు.