Kalamkaval Movie Review: సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కలంకావల్ (Kalamkaval) మమ్మూట్టి నటించిన మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. 2025 డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి, ఇప్పుడు జనవరి 16, 2026 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులో ఉంది. డెబ్యూ డైరెక్టర్ జితిన్ కె. జోస్ తీసిన ఈ సినిమా సీరియల్ కిల్లర్ థీమ్‌పై ఆధారపడి, రియల్ ఈవెంట్స్ నుంచి ప్రేరణ పొందింది. మమ్మూట్టి అరుదైన నెగెటివ్ రోల్‌లో, వినాయకన్ ఇన్వెస్టిగేటర్‌గా నటించారు.
2005 నుంచి 2012 వరకు కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మధ్య వయస్కులు, విడాకులు తీసుకున్నవారు, ఒంటరిగా ఉండే మహిళలు అనేకమంది అదృశ్యమవుతారు. ఎలాంటి క్లూస్ లేకుండా కేసు పెద్ద తలనొప్పిగా మారుతుంది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ జయకృష్ణ (వినాయకన్), గుడ్లగూబ అనే మారుపేరుతో ఇన్వెస్టిగేషన్ చేపటతాడు. అతని అన్వేషణలో ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్ స్టాన్లీ దాస్ (మమ్మూట్టి) పేరు వస్తుంది. స్టాన్లీ బయటికి మంచి మనిషిలా కనిపిస్తాడు కానీ, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వివాహం చేసుకుంటానని మోసం చేసి, అదే రోజు హత్య చేస్తాడు. జయకృష్ణ కేసులో లోతుగా వెళ్తున్న కొద్దీ అంతదాకా దాగి ఉన్న భయంకర రహస్యాలు బయటపడతాయి. స్టాన్లీ మనసులోని విషం, అతని మానసిక స్థితి, హత్యల వెనుక ఉన్న మోటివ్‌లు కథను ముందుకు నడిపిస్తాయి. ఇది సీరియల్ కిల్లింగ్స్‌తో పాటు మైండ్ గేమ్స్, సైకలాజికల్ డ్యూయల్‌పై ఫోకస్ చేస్తుంది.
‘కలంకావల్’ మొదట్లో నెమ్మదిగా కొనసాగే థ్రిల్లర్‌గా మొదలై, క్రమంగా టెన్షన్ పెంచుతుంది. డైరెక్టర్ జితిన్ కె. జోస్ తన డెబ్యూలోనే మెచ్యూర్డ్ హ్యాండ్లింగ్ చూపించాడు. సినిమా మొదటి భాగంలో అన్వేషణ ప్రక్రియ, క్లూస్ సేకరణ బాగా బిల్డ్ చేస్తుంది. మధ్యలో కొంత పేసింగ్ స్లో అయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ దాన్ని కవర్ చేస్తాయి. ట్విస్ట్స్ ఎఫెక్టివ్‌గా వర్కవుట్ అవుతాయి, ముఖ్యంగా స్టాన్లీ క్యారెక్టర్ రివీల్, అతని మానసిక స్థితి ఎలా బయటపడుతుందో ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. మైండ్ గేమ్స్, క్యారెక్టర్ డైనమిక్స్ సినిమాను ముందుకు నడిపిస్తాయి. రియల్ ఈవెంట్స్ నుంచి తీసుకున్నా, సినిమాటిక్‌గా ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేశారు. కొన్ని పాయింట్లలో ప్రెడిక్టబుల్ అయినా, ఓవరాల్ నెరేషన్ గ్రిప్పింగ్. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ట్విస్ట్స్ సినిమాను హైలెవల్‌కు తీసుకెళ్తాయి. మలయాళ సినిమాల్లో సీరియల్ కిల్లర్ జోనర్‌కు కొత్త డెఫినిషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.
మమ్మూట్టి ఈ సినిమాలో అరుదైన నెగెటివ్ రోల్‌లో అద్భుతంగా మెరిసాడు. స్టాన్లీ దాస్ క్యారెక్టర్‌లో అతని స్టిల్‌నెస్, కోల్డ్ ప్రెసిషన్, మెనేసింగ్ లుక్ ప్రేక్షకులను భయపెడతాయి. అతని మానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, మైండ్‌లోని విషాన్ని సూచించే ఎక్స్‌ప్రెషన్స్ అంత త్వరగా మరచిపోనివి. ఇది ఆయన కెరీర్‌లోమి పీక్ పెర్ఫార్మెన్స్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. వినాయకన్ ఇన్వెస్టిగేటర్ జయకృష్ణగా ఇంటెన్స్‌గా, రిస్ట్రెయిన్డ్‌గా నటించాడు. అతని ఇంటెన్సిటీ, ఎమోషనల్ డెప్త్ సినిమాను బ్యాలెన్స్ చేస్తాయి. సపోర్టింగ్ రోల్స్‌లో రాజీష విజయన్, మాళవిక మేనన్, గిబిన్ గోపినాథ్, గాయత్రి అరుణ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మమ్మూట్టి-వినాయకన్ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.
సినిమాటోగ్రఫీ (ఫైసల్ అలి) అద్భుతంగా ఉంది, డార్క్ టోన్, అట్మాస్ఫియర్ బాగా క్యాప్చర్ చేసింది. ఎడిటింగ్ (ప్రవీణ్ ప్రభాకర్) షార్ప్‌గా ఉండి పేసింగ్‌ను కంట్రోల్ చేస్తుంది. ముజీబ్ మజీద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలో టెన్షన్ పెంచడంలో కీలకం. ప్రొడక్షన్ వాల్యూస్ హై-క్వాలిటీగా ఉన్నాయి.
మమ్మూట్టి అద్భుతమైన నెగెటివ్ రోల్, వినాయకన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ‘కలంకావల్’ ఒక సాలిడ్ సైకలాజికల్ థ్రిల్లర్. స్లోగా మొదలై ఫాస్ట్ పేస్‌లోకి వెళ్లే స్టైల్‌లో గ్రిప్పింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. థ్రిల్లర్ లవర్స్‌కు తప్పక చూడాల్సిన సినిమా.
రేటింగ్: 3.5/5
– యజ్ఞమూర్తి

