Man Kills Wife Over Social Media Reels: నేటి తరం యువతలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో, తమ ఇష్టాలను, ప్రతిభను చూపించుకునేందుకు చాలామంది రీల్స్, వీడియోలు చేస్తుంటారు. అయితే, ఢిల్లీలో ఓ భర్తకు తన భార్య సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అస్సలు నచ్చలేదు. ఈ విషయమై వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. చివరకు ఆ గొడవ ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది.
ALSO READ: Kanpur murder: స్నేహానికి ఘోరమైన వెన్నుపోటు.. చెల్లితో ప్రేమ వ్యవహారమని.. తల నరికి ముక్కలు చేసి!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నజాఫ్‌గఢ్, పాత రోషన్‌పురాలో నివాసం ఉంటున్న అమన్ (35), అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. అమన్ వృత్తిరీత్యా ఇ-రిక్షా డ్రైవర్. వారి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్. అమన్ భార్యకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. ఆమె తరచుగా రీల్స్ చేస్తూ ఉండేది. సోషల్ మీడియాలో తనని తాను ‘సోషల్ మీడియా ఆర్టిస్ట్’గా పరిచయం చేసుకున్న ఆమెకు సుమారు 6,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే, భార్య రీల్స్ చేయడం అమన్‌కు ఏ మాత్రం నచ్చేది కాదు. ఈ విషయమై వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.
ALSO READ: Intercaste Relationship: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరణ
మంగళవారం తెల్లవారుజామున, వీరి మధ్య మళ్లీ వాదన మొదలైంది. ఈసారి గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో అమన్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. భార్యను చంపిన తర్వాత, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అంతేకాకుండా, విషం కూడా తాగాడు. ఈ విషయమై ఉదయం 4:23 గంటల సమయంలో నజాఫ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు ఒక పీసీఆర్ కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అమన్‌ను రక్షించి, ఆర్‌టీఆర్‌ఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.
ALSO READ: Marriage Proposal: పెళ్లి సంబంధం కోసం ఇంటికి పిలిచి యువకుడిని కొట్టి చంపేశారు
మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని, చుట్టుపక్కల వారి, బంధువుల వాంగ్మూలాలను నమోదు చేసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హత్యతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వారు వెల్లడించారు.
ALSO READ: Man Rapes Sister: సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం.. మరో యువకుడితో ప్రేమలో ఉందని


