ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి 353 వ ఆరాధన సప్త రాత్రోత్సవలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో స్వామి బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, అలంకరణ, మహా మంగళ హారతి నిర్వహించారు. బంగారు మండపంలో మూల రాముల పూజలు నిర్వహించారు.
తమిళనాడులోని శ్రీ రంగ క్షేత్రం నుండి అర్చకులు శ్రీ రంగం ఆలయం నుండి తెచ్చిన శేషవస్త్రాలను రాఘవేంద్ర స్వామికి సమర్పించారు. అనంతరం శ్రీ రంగం ఆలయ అర్చకులు హెచ్.హెచ్.శ్రీ స్వామీజీకి ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. అలంకార, సంతర్పణ, పండితుల ప్రవచన, భజనలతో పవిత్రోత్సవాలు జరిగాయి. రాత్రి ప్రహ్లాద రాయలను గజ వాహనం, కొయ్య, వెండి, బంగారు, నవరత్నాల రతలపై ప్రాకారంలో ఊరేగించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :-
ఆరాధనోత్సవాలు పురస్కరించుకుని యోగీంద్ర కళాప్రాంగణంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యూఎస్ ఏ కు చెందిన విద్వాన్ రిథ్వీక్ తబల సంగీతం, మైసూరుకు చెందిన అంభారుని గురుకుల దాసవాణి వీణ సంగీతం ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఏఏఓ మాదవ శెట్టి, మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు, వెంకటేష్ జోసి, శ్రీపతి, ఐపి నర్సింహులు, ఇంజనీర్ సురేష్ కోనపూర్, వ్యాసరాజ్, అనంత స్వామి, బిందు మాధవ మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.