Saturday, December 21, 2024
HomeదైవంMedak: అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Medak: అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

సురేఖ, సీతక్కలు..

మెదక్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటినాయి. స్థానిక జూనియర్ కలశాల వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో పాల్గొనడనికి మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు వచ్చారు.

- Advertisement -

ప్రభుత్వం అధికారకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి మెదక్ పట్టణం లోని మహిళాలంతా పెద్ద ఎత్తున తరలి రావటంతో జూనియర్ కలశాల ప్రాంగణం అంత కిటకిటలాడిపోయి పోయింది. ప్రత్యేక ఆకర్షణగా మంగ్లీ బతుకమ్మకు సంబంధించిన పాటలతో కలశాల ప్రాంగణం అంత మార్మోగిపోయింది.

స్థానిక ఎస్ పి కార్యాలయం వద్దకు ప్రత్యేక చాపర్లో వచ్చిన మంత్రులకు ఎం ఎల్ ఎ రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్ పి ఉదయకుమార్ రెడ్డి, అదనపు ఎస్ పి మహేందర్ లు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు కొండ సురేఖా సీతక్కలు జూనియర్ కలశాల వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు ప్రారంభం చేసి, స్థానిక మహిళాలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, మమేకమై బతుకమ్మ ఆడుతూ, చప్పట్లతో కళాశాల ప్రాంగణం అంతా ఉత్తేజపరుస్తూ అందరికి బతుకమ్మ దసరా శుభకాంక్షలు తెలియ చేసారు.

ఈ సంబరాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్కాజిగిరి మాజీ ఎం ఎల్ ఎ మైనంపల్లి హనుమంత రావు సతీమణి మెదక్ మాజీ ఎం ఎల్ ఎ మైనంపల్లి వాణి, ఎం ఎల్ ఎ సతీమణి శివాని స్థానిక మహిళా కౌన్సిలర్లు స్థానిక నాయకులు మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ తడితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News