Monday, October 28, 2024
HomeNewsNara Lokesh: టెస్లా హెడ్ ఆఫీసుకి మంత్రి లోకేష్.. ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి

Nara Lokesh: టెస్లా హెడ్ ఆఫీసుకి మంత్రి లోకేష్.. ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి

Nara Lokesh| ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్(Nara Lokesh).. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం ప్రోత్సహకాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆస్టిన్‌లోని టెస్లా కేంద్ర కార్యాలయానాకి వెళ్లారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్‌వో(CFO) వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… “విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వాన 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మా లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అవసరమని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఆయన దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంది” అని తెలిపారు.

ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం వహించండి. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారిస్తే సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాబోయే డేటా సెంటర్, ఐటీ హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజీ పరిష్కారాలు అవసరం, టెస్లా ఏపీకి వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం వహించండి. ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా… ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్క్‌లను ఏర్పాటు చేయాలి” అని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ పర్యటనలో భాగంగా పెరోట్‌ గ్రూప్‌ అండ్‌ హిల్‌వుడ్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ రాస్‌ పెరోట్‌ జూనియర్‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏవియేషన్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలయెన్స్‌ టెక్సాస్‌ తరహా ప్రాజెక్టులకు రాష్ట్రంలోని తీరప్రాంతం అనుకూలమని వివరించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. మొత్తానికి లోకేష్ విజ్ఞప్తిపై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News