రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly) రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) రైతు భరోసాపై(Raithu Bharosa) కీలక ప్రకటన చేశారు.
ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2017-18లో రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిందన్నారు. అనంతరం 2018-19లో ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పథకం సక్రమంగా అమలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు. నిపుణులు, రైతుల సలహాలు సూచనలు తీసుకొని ఈ కమిటీ విధివిధానాలను తయారు చేస్తోందన్నారు. కమిటీ నివేదిక అనంతరం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నామని స్పష్టం చేశారు.