Wednesday, June 18, 2025
HomeNewsNagarjuna Akkineni: అఖిల్‌తో మరోసారి నాగ్..

Nagarjuna Akkineni: అఖిల్‌తో మరోసారి నాగ్..

Akhil Akkineni – Lenin: మనం సినిమా తెలుగు సినిమాల్లోనే ఓ అరుదైన సినిమాగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం. ఆయనతో పాటు నాగార్జున, చైతన్య, అఖిల్ సహా మూడు తరాల అక్కినేని హీరోలు ఒకే సినిమాలో నటించడం అన్నది సినీ ప్రేమికులకు ఒక మధురానుభూతిగా నిలిచిపోయిందనే చెప్పాలి. విక్రమ్ కె. కుమార్ రూపొందించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, కథన పరంగా మాత్రమే కాకుండా భావోద్వేగాల పరంగా కూడా ప్రేక్షకులను బాగా కదిలించింది. ఎఎన్‌ఆర్ నుంచి అఖిల్ వరకూ ఒక్కే ఫ్రేమ్‌లో కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇలాంటి సినిమాలు తెరపై రావడం చాలా అరుదు. ఆ క్రెడిట్‌ను కపూర్ ఫ్యామిలీ తర్వాత ఇండియన్ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ సొంతం చేసుకుంది.

- Advertisement -

ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్లు స్క్రీన్ మీద కలిసి కనిపించడం కంటే, అందరికీ బలమైన పాత్రలు ఉండటం, ప్రేక్షకులను తాకే కథా కథనాలు ఉండటం పెద్ద విషయం. మనం ఆ ప్రమాణాలను పాడగా అమలు చేసింది. ఆ తర్వాత చాలామంది అలాంటి మల్టీ జెనరేషన్ సినిమాలు చేయాలనుకున్నా, తగిన స్క్రిప్ట్‌లు రాలేదు. ఇక, నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన బంగార్రాజు కూడా మంచి విజయాన్ని అందుకుంది. తండ్రి-కొడుకుల మధ్య సీన్లు, కమర్షియల్ హంగులు, మ్యూజిక్, ఎమోషన్స్ అన్నీ బాగా మిళితమై ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/news/vijay-deverakonda-fans-are-scared-with-sentiment/

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అక్కినేని నాగార్జున, అఖిల్ మరోసారి తెరపై తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారట. అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న లెనిన్ సినిమాలో నాగార్జున ముఖ్య పాత్ర పోషించబోతున్నారని టాక్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, షూటింగ్ ఇప్పటికే ఎక్కువ భాగం పూర్తి చేసుకుంది. టీజర్ విడుదలయ్యాక మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మనం సినిమాలో అఖిల్ బైక్ సీన్ ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అదే తన అసలైన తెరంగేట్రానికి బీజం కూడా అయింది.

అఖిల్ సినిమా సమయంలో కూడా నాగార్జున ఓ ప్రత్యేక సాంగ్‌లో అఖిల్‌తో కలిసి మెరవడం థియేటర్స్‌లో పండగ వాతావరణం సృష్టించింది. ఇప్పుడు లెనిన్ చిత్రంలో నాగార్జున తండ్రిగా పూర్తి పాత్రలో కనిపిస్తారని సమాచారం, త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇలా చూస్తే, అక్కినేని ఫ్యామిలీ నుంచి మళ్లీ తండ్రి కొడుకుల కాంబినేషన్ తెరపైకి రావడం ఫ్యాన్స్‌కు నిజమైన పండగే అని చెప్పొచ్చు. లెనిన్ సినిమాతో అఖిల్ ఖచ్చితంగా కమర్షియల్‌ హిట్ కొడతాడనే ఆశలు ఎక్కువవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News