Friday, April 4, 2025
HomeNewsNandavaram: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం టిడిపి విజయపరంపరకు శ్రీకారం

Nandavaram: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం టిడిపి విజయపరంపరకు శ్రీకారం

భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం తెలుగుదేశం పార్టీ విజయపరంపరకు శ్రీకారం చుట్టిందని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధవరావ్ దేశాయ్ అన్నారు. టిడిపి మద్దతుతో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించి మునుముందు జరగబోయే ఎన్నికలలో టిడిపి విజయ పరంపర కొనసాగిస్తుందని సూచికను ఎగరవేశామని ఆయన అన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాధవరావ్ దేశాయ్, బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఈరన్న గౌడ్, మండల కన్వీనర్ చిన్న రాముడు, ఉపాధ్యక్షులు కాశిం వలి, గడ్డం నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయానికి కృషి చేసిన టిడిపి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టభద్రులు విజ్ఞానంతో వివేకంతో ఆలోచించి వారి అమూల్యమైన ఓటును వేసి రాంగోపాల్ రెడ్డి విజయానికి కారుకులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News