Friday, November 22, 2024
HomeNewsNara Lokesh: వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం

Nara Lokesh: వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం

Nara Lokesh| శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు 2019-24 మధ్యలో అసెంబ్లీ నుంచి పారిపోయారంటూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

- Advertisement -

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారని.. సింహంలా సింగిల్‌గా నిలబడ్డారని గుర్తుచేశారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించిన తర్వాతే.. ఆవేదనతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే సభకు వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారని తెలిపారు. తాము ఏనాడూ జగన్‌ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. ఆ రోజు తన తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. మరి అప్పుడు అన్ని మాటలు మాట్లాడిన జగన్ ఇప్పుడు ఎందుకు అసెంబ్లీకి రాకుండా పారిపోయారని ప్రశ్నించారు. తన తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారు అని లోకేష్ ఫైర్ అయ్యారు.

https://twitter.com/JaiTDP/status/1856983287308456451
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News