రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ (Anganwadi) కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు.. వెరసి 948 పోస్టులు భర్తీ చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
పారదర్శకంగా ప్రక్రియలు
ఈ మేరకు శనివారం జిల్లాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
రాతపరీక్ష
ఈ పోస్టుల ఎంపికకు రాతపరీక్ష ఉంటుందని, అర్హత ఉన్నవాళ్లను మాత్రమే ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలో 139 కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు.