Thursday, July 4, 2024
HomeNewsప్రభాస్ అంటే ఇష్టం .. ఆయన్ను ఆరాధిస్తాను - పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ప్రభాస్ అంటే ఇష్టం .. ఆయన్ను ఆరాధిస్తాను – పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు , రాజకీయాలతో ఎంతో బిజీ గా ఉన్నారు. సొంతంగా పార్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గర అవుతున్నారు. మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో వరుస పర్యటనలతో గడుపుతున్నారు. ప్రస్తుతం ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేపట్టారు. గత నాల్గు రోజులుగా ఈ యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. అడుగడుగునా పవన్ కళ్యాణ్ కు జనసేన శ్రేణులు , అభిమానులు , వీరమహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. తీవ్ర ఎండను సైతం పవన్ లెక్క చేయకుండా తన యాత్ర ను కొనసాగిస్తూ..అధికార పార్టీ ఫై నిప్పులు చెరుగుతూ..రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ని గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి మేలు చేస్తాననేది కూడా ప్రజలకు వివరిస్తున్నారు.

తాజాగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ సినిమాల ప్రస్తావనను తీసుకొచ్చారు. తన పేరు మీద ఎప్పుడూ ఫ్యాన్ క్లబ్‌లను స్థాపించలేదని అలాగే గత రెండు దశాబ్దాలుగా తాను ఎలాంటి బ్రాండ్‌లకు ప్రచార కర్తగా చేయలేదని తెలిపారు. సినిమా పరిశ్రమలోని నా తోటివారు అంటే నాకు చాలా ఇష్టం. వారి సినిమాలు నేను తరచుగా చూస్తాను. సినిమా అనేది రాజకీయాలకు భిన్నంగా ఉంటుందని , మీరు ఏ నటుడినైనా ప్రేమించే స్వేచ్ఛ ఉంది. అయితే మీరు ఏకాభిప్రాయంతో ఉంటే బాగుంటుందని పవన్ పేర్కొన్నారు. అలానే తాను చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, చిరంజీవిగారిని ఆరాధిస్తానన్నారు.

ఇతర నటీనటుల సినిమాలు చూడటం తనకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుందని, కేవలం తన సినిమాలతోనే పరిశ్రమ మనుగడ సాగించదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తన సినిమాల ద్వారా చాలామందికి ఉపాధి లభిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన ద్వారా ప్రజలకు మరింతగా చేరువావ్వలనేది తన ఉద్దేశ్యం క్లారిటీ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలతో మెగా అభిమానులే కాదు ప్రభాస్ , ఎన్టీఆర్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం సెట్స్ ఫై OG తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోపక్క సముద్రఖని డైరెక్షన్లో బ్రో చేసాడు. ఇది షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తుండడం విశేషం.

OG విషయానికి వస్తే సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా , ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హరిహర వీరమల్లు మూవీని ప్రస్తుతం పక్కకు పెట్టారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం ముందుగా OG తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ లను పూర్తి చేయాలనీ పవన్ చూస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News