Sunday, July 7, 2024
HomeNewsజనవాణి లో పవన్ కంటతడి..

జనవాణి లో పవన్ కంటతడి..

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర లో బాధితుల బాధలు విని కన్నీరు పెట్టుకున్నారు. ఏపీలో మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు , ఆయన కుమారుడు నారా లోకేష్ ఇప్పటికే పలు యాత్రలు మొదలుపెట్టగా..తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వారాహి యాత్ర మొదలుపెట్టారు. జూన్ 14 న మొదలైన ఈ యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రతి చోట పవన్ కళ్యాణ్ కు ప్రజలు నీరాజనాలు అందిస్తూ..జై..జై లు పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షో చేస్తూ..అక్కడక్కడా సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ వైస్సార్సీపీ ఫై నిప్పులు చెరుగుతున్నారు.

శనివారం కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి జనవాణిలో పాల్గొన్న పవన్ కళ్యాణ్..దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడో రోజు శనివారం కాకినాడలో విజయంవతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉదయం స్ధానికంగా ఉన్న నగర ప్రముఖులతో పాటు మేథావులతోనూ భేటీ అయ్యారు. వారితో అక్కడి తాజా పరిస్ధితులపై చర్చించారు. అనంతరం జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా దురదృష్టవశాత్తు వేర్వేరు ప్రమాదాల్లో మృతిచెందిన జనసేన క్రియాశీలక సభ్యులకు పవన్ నివాళులర్పించారు. ఓ దివ్యాంగుడి పరిస్థితి గురించి తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

రూ.75 నుంచి పెన్షన్ తీసుకుంటున్నాని.. కానీ 2021లో పెన్షన్ తీసివేశారని దివ్యాంగుడు శ్రీనివాస్..పవన్ కళ్యాణ్ కు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ కరెంట్ బిల్లు అని సాకు చూపించి ఉద్దేశపూర్వకంగా పింఛన్ తొలగించారని.. పలావుతో తిండి తిను, చేపల కూర నీకు అవసరమా అని అధికార పార్టీ నేతలు ఎగతాళి చేశారని శ్రీనివాస్ చెప్పుకున్నారు. 35 కేజీల రేషన్ బియ్యం వచ్చేదని, అది కూడా బంద్ చేసి ఇబ్బందులు పెట్టారన్నారు. మేం తినేది ఈ బియ్యం, అసలే మా అమ్మకు షుగర్ ఉంది, థైరాయిడ్ కూడా ఉందని తన కుమారుడు అడిగితే మళ్లీ బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారని దివ్యాంగుడి తల్లి కనకం కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాస్ పడుతున్న కష్టాలు చెబుతుంటే చలించిపోయిన పవన్ కంటతడి పెట్టారు. దివ్యాంగుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News